భీమారంలో రేపు విద్యుత్ సరఫరా నిలిపివేత.
భీమారం: విద్యుత్ లైన్ల నిర్వహణ మరియు కొత్త లైన్ నిర్మాణ పనుల కారణంగా రేపు (ఆగస్టు 20, గురువారం) భీమారం పరిధిలోని పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.
సుద్దాల నుండి భీమారం వరకు నూతనంగా 33KV లైన్ పనులు చేపడుతున్నందున ఉదయం 10:30 గంటల నుండి సాయంత్రం 4:00 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదు. ఈ క్రమంలో ఎలకేశ్వరం, ఎల్.బి. పేట, మరియు కొత్తపల్లి గ్రామాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది.
మరమ్మతులు మరియు పనులు పూర్తి చేసుకుని రాత్రి 09:00 గంటల నుండి విద్యుత్ సరఫరాను యథావిధిగా పునరుద్ధరించనున్నట్లు భీమారం విద్యుత్ శాఖ ఏఈ (AE) బి. శంకర్ ఒక ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి, సహకరించాలని ఆయన కోరారు.